
ఆందోళన చేస్తున్న పాడి రైతులు
ప్రజాశక్తి-కోటవురట్ల:గత ప్రభుత్వంలో పాడి రైతులు నిర్మించుకున్న మినీ గోకులం బిల్లులు చెల్లించాలంటూ బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో రైతులకు పశువుల షెడ్డుల నిమిత్తం రైతు వాటా పది శాతం చెల్లించి మినీ గోకులం పేరుతో నిర్మాణాలు చేపట్టినా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని పాడి రైతులు తెలిపారు.మండలంలో నిర్మాణాలు చేపట్టిన రైతులకు కాకుండా సాయి బాలాజీ కంపెనీ పేరుతో నిధులు దారి మళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. అనంతరం ఎంపీడీవో కాశీ విశ్వనాథరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పెట్ల నరేష్, శ్రీనివాసరావు సహా పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.