Oct 12,2023 22:47

ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్‌ : పాడిరైతు ఆర్థికాభివద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కృష్ణా మిల్క్‌ యూనియన్‌ కషి చేస్తుందని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. హనుమాన్‌ జంక్షన్‌ కస్టర్డ్‌ పరిధిలోని రమణక్కపేట, అక్కిరెడ్డిగుడెం లో బుధవారం నిర్వహించిన పాడిరైతు సంక్షేమమే మన మతం- అలుపెరుగని సేవ మన అభిమతం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలసేకరణ, వెన్నశాతం తదితర విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సొసైటీ సభ్యులు,పాలకవర్గ సభ్యులు, పాడిరైతులతో సమావేశం నిర్వహించారు. దేశంలోనే అత్యధిక పాలసేకరణ ధర చెల్లించడంతో పాటు మేలుజాతి పశువుల కొనుగోలుకు సహకార మందిస్తూ దాణా, పచ్చగడ్డి విత్తనాలు, మందులు సబ్సిడీపై అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవాసాం ద్రుల సహకారంతో యువతకు లబ్ధి చేకూరేలా సాంకేతిక సహకారంతో కూడిన మినీ డెయిరీ పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.అనంతరం ఛైర్మన్‌ చలసాని సొసైటీ అధ్యక్షులు అధ్యక్షతనలో 264 పాడి రైతులకు బోనస్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా బోర్డు డ్కెరెక్టర్‌ ఎస్‌. వెంకట శివ జ్యోతి, మేనే జర్‌ కిలారు కిరణ్‌, సంఘ అధ్యక్షులు బి.లీలా కోటేశ్వరరావు , ఎం.పద్మ పాల్గొన్నారు.