Apr 06,2023 00:44

మాట్లాడుతున్న పశు వైద్యాధికారి

ప్రజాశక్తి -హుకుంపేట: గిరిజన పాడి రైతులు పాల ఉత్పత్తులు సాధించి ఆర్థిక లాభాలు సాధించాలని పశువైద్యాధికారి కే.చరణ్‌ కోరారు. మండలంలో తడికల పంచాయతీ కేంద్రంలో పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో భాగంగా బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ముందుగా గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశువులు అనేక రోగాలు బారిన పడి మృత్యువాత పడుతుండటంతో పశుసంతతి అంతరించి పోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రంజిత్‌ కుమార్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ ప్రశాంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.