కురుస్తున్న వర్షం
ప్రజాశక్తి-పాడేరుటౌన్:ఉదయమంతా ఎండ... మధ్యాహ్నమైతే వర్షం ఇలా..గత కొద్ది రోజులుగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో కొనసాగుతుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుతో పాటు మన్యంలోని పలు ప్రాంతాల్లో శనివారం కూడా భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత నెలకొంది. తరువాత ఒకసారిగా వాతావరణం మారి ఆకాశం మేఘావృతమై వర్షం మొదలైంది. 4 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి పాడేరు పట్టణం తడిచి ముద్దయింది. భారీగా వర్షం కురవడంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికి పట్టణంలోని రోడ్లు, వీధులు చిత్తడిగా మారాయి.










