వర్షం
ప్రజాశక్తి-పాడేరుటౌన్:వాతావరణంలో మార్పుల కారణంగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వాతావరణం కొనసాగి, ఆ తర్వాత వాతావరణం మారింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. గంటసేపు కురిసిన వర్షానికి పాడేరు పట్టణం తడిచి ముద్దయింది. భారీగా వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లు వీధులు జలమయ మయ్యాయి. చిరు వ్యాపా రులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహన దారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు.










