ప్రజాశక్తి-పాడేరు:గిరిజన సంస్కతి సాంప్రదాయాలను విశ్వాసాలను విడిచిపెట్టి కరాయిస్తవా లేదా ఇస్లాం మతంలోకి మారిన గిరిజనులు షెడ్యూల్డ్ తెగకు చెందిన సభ్యులుగా పరిగణించబడరని, ఈ విధంగా మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జన జాతి( గిరిజన) సురక్ష మంచ్ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు తలారి సింగ్ నుంచి చుండ్రు పుట్టు మెయిన్ రోడ్డు మీదుగా అంబేద్కర్ జంక్షన్ మీద నుంచి సభాస్థలి జూనియర్ కళాశాల వరకు అతి పొడవైన ర్యాలీ కొనసాగింది. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ, మతం మారిన గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ వర్తించదని , దీనిపై పార్లమెంట్లో బిల్లు తేవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు పాల్గొన్నారు.










