
'ఓయాసిస్'లో గర్భవతులకు సత్కారం
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో గర్భవతులకు బుధవారం సత్కారం నిర్వహించారు. స్థానిక ఎమ్‌ఆర్ పల్లి సర్కిల్లోని ఓయాసిస్ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భవతులకు సత్కారము సందర్భంగా ఓయాసిస్ ఫెర్టిలిటీ, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జాహ్నవి ఎసనాకుల మాట్లాడుతూ భారతదేశంలో లక్షలాది మంది సంతానం లేక బాధపడుతున్నారని పేర్కొన్నారు. దంపతులు సంతానం పొందడానికి అనేక చికిత్సలు అందుబాటులో కలవన్నారు. అయితే, దీనిపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదన్నారు. దీంతో ఆశలు వదులుకుంటున్నారని పేర్కొన్నారు. అస్థిర జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, పీసీవోఎస్, ప్రసూతి వయస్సు పైబడటం తదితర గర్భధారణను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. సరైన సమయంలో సంతానోత్పత్తి నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. తిరుపతి కేంద్రంలో 300 మంది తల్లులకు చికిత్స అందిస్తే 70 శాతం మంచి ఫలితాలు వచ్చాయన్నారు. డాక్టర్ భారతి, కార్పొరేటర్ సంధ్య పాల్గొన్నారు.
గర్భిణులతో ఓయాసిస్ ఆస్పత్రి యాజమాన్యం