ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాల వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో డాక్టర్ జాకీర్‌హుస్సేన్ కళాశాల ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.మహాభాష తెలిపారు. ఈ నెల 9, 10 తేదీలలో డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీలలో కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయ క్రీడలలో పాల్గొననున్న క్రీడాకారులను ఎంపిక చేశారని తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ పురుషులు, మహిళల ఓవరాల్ ఛాంపియన్ షిప్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల కైవసం చేసుకోగా రన్నర్స్‌గా పిబి సిద్దార్థ కళాశాల నిలిచిందని తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ ఉమెన్ ఛాంపియన్ విన్నర్స్‌గా పిబి సిద్ధార్థ కళాశాల గెలుచుకోగా రన్నర్స్‌గా డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల నిలిచింది. పవర్ లిఫ్టింగ్ మెన్ ఛాంపియన్ విన్నర్స్‌గా డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల కైవసం చేసుకోగా రన్నర్స్‌గా పిబి సిద్ధార్థ కళాశాల గెలుచుకుంది. ఈ కార్యక్రమానికి స్థానిక తహశీల్థార్ జి సుర్యారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు అబ్దుల్ మతిన్ ఎకె బాషా, స్థానిక కాంట్రాక్టర్ శరత్ బాబా, జిమ్ అధినేత బాబావలి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు మస్తాన్‌వలీ, నాగుల్‌మీరా పాల్గొన్నారు. పోటీలను కళాశాల ఫిజికల్ డైరెక్టర్ హమీద్‌ఖాన్ పర్యవేక్షించారు.










