ప్రజాశక్తి-రేపల్లె: గ్రామంలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తున్నట్లు సర్పంచ్ యార్లగడ్డ లక్ష్మీ సోమశేఖర్ తెలిపారు. మండలంలోని వెజెండ్లవారి లంక గ్రామంలో శుక్రవారం ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు ఆశీస్సులతో మోర్లవారిపాలెం గ్రామ పంచాయతీ వేజళ్ళవారిలంకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజల అవసరానికి అనుగుణంగా 40 వేల లీటర్ల సామర్ధ్యం గల తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మండలి అంజయ్య విశ్వేశ్వరం గ్రామ సర్పంచ్ మల్లేశ్వరరావు, మోర్తోట సర్పంచ్ శ్రీనివాసరావు, పేటేరు వైసీపీ ఇన్‌ఛార్జీ కనపర్తి రవికిరణ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గోపాలకృష్ణ పంచాయతీ సెక్రటరీ బొర్రా ప్రసాద్, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










