ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్ :11వ డివిజన్, సరస్వతి నగర్ లోని ఒవెల్ మోడ్రన్ పాఠశాలలో హిందీ దివాస్ వేడుకలు సెప్టెంబర్ 14న ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఓవెల్ పాఠశాలల సిఎమ్‌డి ఆర్. వేణు వచ్చారు. ఆయన మాట్లాడుతూ భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహదపడినందున్నారు. గాంధీజీ స్ఫూర్తి తో 1949 సెప్టెంబర్ 14న హిందీని కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించిందన్నారు. ఈ వేడుకల సందర్భంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు కహానీ, వ్యాకరణం, సంభాషణ్, ఏకపాత్రాభినరు, నాటక్, కవిత - కవిపరిచరు, సమీక్ష ఇలా వివిధ అంశాలను ప్రదర్శించారు. ప్రిన్సిపల్ యు రమణయ్య నాయుడు మాట్లాడుతూ హిందీ భాష విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిఎం మహదేవ్, డి.జి.యం. శ్రీనివాస్, ప్రైమరీ ఇన్‌ఛార్జి ఎం రమాదేవి, హై స్కూల్ ఇంఛార్జి ప్రసాద్ రెడ్డి, ఏ.జి.యం. సునీల్ ఉన్నారు.










