ఎంఎల్‌సి షేక్ సాబ్జీ
ప్రజాశక్తి - ఆగిరిపల్లి
ప్రజాస్వామ్యంలో ఓ టు హక్కు అమూల్యమైనదని, దాన్ని వృధా చేయొద్దని, నిజాయితీపరులకు ఓటు వేసి ఎన్నుకోవాలని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ సూచించారు. ఆగిరిపల్లిలోని యుటిఎఫ్ భవనంలో జరిగిన యుటిఎఫ్ మండల జనరల్ కౌన్సెల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ సభ్యత్వం పూర్తిచేసుకుని తొలి మండల కౌన్సిల్ ఎన్నికలు జరుపుకుంటున్న ఆగిరిపల్లి యుటిఎఫ్ శాఖకు ఆయన అభినందనలు తెలిపారు. ఆగిరిపల్లి యుటిఎఫ్ భవనానికి యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి అక్కినేని కృష్ణ సుందరరావు పేరుపెట్టడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి మరో ఎంఎల్‌సి కెఎస్.లక్ష్మణరావు అన్నారు. అనంతరం మండల యుటిఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పామర్తి కృష్ణ, కలపాల అజరయ్య, గౌరవఅధ్యక్షులుగా బత్తుల జీవరత్నం, కోశాధికారిగా సతీష్, ఉపాధ్యక్షులుగా అంజనాదేవి, రాకేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జ్ఞానసుందరం, అపర్ణ, రామచంద్రన్, పాపారావు, కిశోర్, రవికుమార్ పాల్గొన్నారు.










