
ప్రజాశక్తి-టంగుటూరు : ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో ఓటరు జాబితాలో పరిశీలించు కోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నారదమని సూచించారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో బిఎల్‌ఒలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ ఈనెల 4,5 తేదీల్లో ఓటరు జాబితా స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లందరూ తమ కుటుంబ సభ్యులు పేర్లు అన్నీ జాబితాలో సరిగా ఉన్నాయా లేవో సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలపై బిఎల్‌ఒలకు అధికారులు అనేక సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్బందీగా పాటించాలని చెబుతున్నప్పటికీ కొందరు బిఎల్‌ఒలు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఇంటింటీ సర్వే ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కొల్లిబోయిన సంజీవరావు, ఉప తహశీల్దారు జె శ్రీనాథ్, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.