Sep 04,2022 23:29

స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్న తహశీల్దార్‌ వీరభద్రరావు, కార్పొరేటర్‌ నాగేశ్వరరావు

ప్రజాశక్తి -ములగాడ : ప్రతి పౌరుడూ ఓటును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని 40వ వార్డు కార్పొరేటర్‌ గుండపు నాగేశ్వరరావు సూచించారు. ఓటర్లు నమోదుకు ఆదివారం 40వ వార్డు పరిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని పోలింగ్‌ స్టేషన్లను ములగాడ తహశీల్దార్‌ వీరభద్రరావుతో కలిసి గుండపు నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఓటరు ఓటు వేసి పోలింగ్‌ బూత్‌ స్టేషన్‌లోనే ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.