ప్రజాశక్తి - భీమడోలు
ఓటు గుర్తింపు కార్డుతో ఆధార కార్డు అనుసంధానం స్వచ్ఛందంగా చేసుకోవాలని ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి, భీమడోలు తహశీల్దార్ ఇ.జాన్‌రాజు కోరారు. మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఆదివారం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తహశీల్దార్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా తహ శీల్దార్ మాట్లాడుతూ నూతన ఓటర్ల చేర్పులు, బదిలీలు, తొలగింపులు, ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు నిర్ణీత దరఖాస్తులు పోలింగ్ కేం ద్రాల వద్ద అందుబాటులో ఉంచా మన్నారు. ఈ విషయమై ఓటర్లకు సహకరించేందుకు సదరు పోలింగ్ బూత్ ల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్య క్రమం లో భీమడోలు గ్రామ రెవెన్యూ అధికారులు వెజ్జు వినయకుమార్, జి.మార్కండేయులు పాల్గొన్నారు.










