
మాట్లాడుతున్న ఆర్డీవో
ప్రజాశక్తి-గొలుగొండ:18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలని నర్సీపట్నం ఆర్డీవో జయరాం సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఎల్‌వోల సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ, బిఎల్‌వోలు తమ పరిధిలో ఉన్న ఓటర్ జాబితాను సరి చూసుకొని జనాభా పరిమితిలో ఓట్లు ఉన్నవి లేనివి పరిశీలించాలన్నారు. డెత్‌లను, డబల్ ఎంట్రీలను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి. ఆనందరావు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.