Nov 20,2022 22:07

రెండు రోజుల్లో 2007 దరఖాస్తుల స్వీకరణ
ప్రజాశక్తి - ఉంగుటూరు

              కొత్తగా ఓటు హక్కు కోసం యువత క్యూ కట్టారు. భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కొత్త ఓటర్లు నమోదు, చిరునామా మార్పు, ఓటు బదిలీ దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఈ నెల 19, 20 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గంలో 213 పోలింగు కేంద్రాల్లో ఈ దరఖాస్తులను స్వీకరించారు. 18 నుంచి 19 ఏళ్లు వయస్సు వారు 828 మంది, 19 ఏళ్లు పైబడిన వారు 844 మంది, ఫారం-7కు సంబంధించి 209 మంది, ఫారం-8కి సంబంధించి 126 మంది మొత్తం 2007 మంది దరఖాస్తులు సమర్పించారని అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ఉంగుటూరు తహశీల్దార్‌ ఎవి.రమణరావు తెలిపారు.
ముసునూరు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాలని తహశీల్దార్‌ దాసరి సుధ అన్నారు. ఆదివారం మండలంలోని 16 గ్రామాల్లో నూతనంగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేశామని చెప్పారు.