ఎస్‌పి గౌతవి శాలి
ప్రజాశక్తి -అనకాపల్లి
విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య యాజమాన్యాలు, ఉపాధ్యాయులు అందించాలని ఎస్పీ గౌతమి శాలి సూచించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థులతో స్నేహ పూర్వకంగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. వాటిని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల మానసిక ఒత్తిడిని నివారించాలని సూచించారు. ప్రచార వాహనం ద్వారా మహిళ చట్టాలు, ఫోక్సో చట్టం, ర్యాగింగ్ ఈవ్ టీజింగ్, మాదక ద్రవ్యాల వాడకం, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ చట్టాలు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు నరసింహారావు, చంద్రశేఖర్, అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.










