వేంపల్లె : ఓటరు వెరిఫికేషన్ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు కోరారు. శుక్రవారం టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, మైనార్టీ నేత మహమ్మద్ దర్బార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవి కుమార్ ఓటర్ల జాబితా వెరిఫికేషన్, పోలింగ్ బూత్‌ల మార్పుపై రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి మాట్లాడుతూ ఓటర్ల వెరిఫికేషన్‌కు బిఎల్‌ఒలు రావడం లేదని పిర్యాదు చేసినట్లు తెలిపారు. పది రోజులు గడిచినా ఇంతవరకూ బిఎల్‌ఒలు ఓటర్ వెరిఫికేషన్ చేయడం లేదని విమర్శించారు. ఫోన్లు చేసి బిఎల్‌ఒ్లను పిలిచినా స్పందించడం లేదని వాపోయారు. బిఎల్‌ఒల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఓటరు వెరిఫికేషన్ సజావుగా చేసి దొంగ ఓట్లు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. బిఎల్‌ఒల నుండి సరైన సమాధానం చెప్పకుండా సర్వర్లు పని చేయడం లేదని చెప్పుతున్నట్లు చెప్పారు. 6,7 కుటుంబాలు పరిశీలించిన తర్వాత టైం లేదని బిఎల్‌ఒలు అంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం జూలై 20 నుంచి ఆగస్టు 20 లోపల ఓటర్ల పరిశీలన ముగించాలని ఆదేశించినా బిఎల్‌ఓలలో మాత్రం చలనం లేదన్నారు. మైనార్టీ నేత నిమ్మకాయల మహమ్మద్ దర్బార్ మాట్లాడుతూ పోలింగ్ బూత్‌లు కూడా మార్పు చేయడం వల్ల ఓటర్లకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. శ్రీరాం నగర్, ఇమాం నగర్, కాలేజీ రోడ్డు, బిడ్డాల మిట్ట, పుల్లయ్య తోటలో నివాసం ఉంటున్న ఓటర్లకు రాజీవ్ నగర్, బాల సరస్వతి పాఠశాల వద్ద పోలింగ్ కేంద్రాలు పెట్టడంతో మూడు కిలో మీటర్లు దూరం పోవాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. ముస్లిం మహిళలు దూర ప్రాంతానికి వెళ్లి ఓట్లు వేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉందని తెలిపారు. మరి కొందరు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నట్లు చెప్పారు. ఎక్కడి స్థానికులకు అక్కడే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మానవతా దక్పథంతో ఆలోచించి ఓటర్లకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల లోపు పోలింగ్ బూత్‌లు మార్చాలని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, మైనార్టీ మండల కన్వీనర్ తెలంగాణ వలి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా, డక్కా రమేష్, పోతిరెడ్డి శివ, జబిబుల్లా, గొగుల మల్లికార్జున, గొటూరు నాగభూషణం, మడక శ్రీనివాసులు, పాములూరు చంటి, ఈశ్వరయ్య, వెంకటయ్య, వేమా, ఫయాజ్, మహబూబ్ షరీఫ్, వెల్డింగ్ బాష, రమేష్, ఇలియాస్ పాల్గొన్నార










