సుండుపల్లి : ఓటరు సర్వేని త్వరగా పూర్తి చేయాలని ఆర్‌డిఒ రామక్రిష్ణారెడ్డి బిఎల్‌ఒలను ఆదేశించారు. శుక్ర వారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఎల్‌ఒ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండ లంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ దాదాపుగా 98 శాతం పూర్తయిందని పెండింగ్ జాబితా ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతి ని ధులతో కలిసి మరణించిన వారి ఓటును తొలగించి, కొత్తవారిని కూడా నమోదు ప్రక్రియను చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఎవరైన రాజకీయ నాయకులు ఒత్తిడికి గురిస్తే తనకు సమా చారమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి తహశీల్దార్, సూపర్వైజర్లు , బిఎల్‌ఒలు పాల్గొన్నారు.
ఇసుక సమస్యను పరిష్కరించాలి
సుండుపల్లి : మండలంలో గత నెల నుంచి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక, మట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గృహ లబ్దిదారులు శుక్రవారం రాజంపేట ఆర్‌డిఒ రామకష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులు చెబుతున్నారని, ఇసుక, మట్టి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తమకు సకాలంలో ఇసుక, మట్టి కొరతను తీరిస్తే ఇంటి నిర్మాణాలను చేపడతామని చెప్పారు. హౌసింగ్ అధికారులతో చర్చించి ఇసుక సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌డిఒ హామీనిచ్చారని చెప్పారు.










