Aug 21,2023 00:17

సర్వేను పరిశీలిస్తున్న తహసీల్దార్‌

ప్రజాశక్తి -కోటవురట్ల:ఓటర్‌ ధ్రువీకరణ సర్వే పట్ల బూత్‌ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దారు జానకమ్మ సూచించారు. మండలంలో పలు గ్రామాలలో ఓటర్‌ సర్వేను ఆమె ఆదివారం పరిశీలించారు. ఓటర్ల తొలగింపులు, చేర్పులు, సవరణల పట్ల తగు జాగ్రత్తలు పాటించాని సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా 52 పోలింగ్‌ బూత్‌ లలో 94 శాతం సర్వే పూర్తయిందని శత శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు బూత్‌ స్థాయి సూపర్వైజర్లు పాల్గొన్నారు.
నక్కపల్లి:ఇంటింటా జరుగుతున్న ఓటరు సర్వే తీరును ఆదివారం తహసీల్దార్‌ అంబేద్కర్‌ పరిశీలించారు. మండలంలోని వేంపాడు, డి ఎల్‌ పురం తదితర గ్రామాల్లో పర్యటించి ఓటరు సర్వే ను పరిశీలించారు. ఓటర్‌ జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటివి పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్‌ డిటి తాతాచార్యులు పాల్గొన్నారు.