Jul 21,2023 22:19

ఇంటింటి ఓటరు నమోదులో పాల్గొన్న ఆర్‌డిఒ హేమలత

పార్వతీపురం రూరల్‌ : ఓటర్ల సమ్మరి రివిజన్‌ పక్కాగా జరగాలని ఆర్‌డిఒ కె.హేమలత ఆదేశించారు. మండలంలోని కష్ణపల్లిలో 4,5 పోలింగ్‌ కేంద్రాలు, సీతానగరం మండలంలో 127,128 పోలింగ్‌ కేంద్రాలను శుక్ర వారం తనిఖీ చేశారు. హౌస్‌ టు హౌస్‌ వెరిఫికేషన్‌లో అంతా పాల్గొనాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇదివరకే అయ్యాయని వాటిని పాటించాలని చెప్పారు. బిఎల్‌ఒలు సంబంధిత ఫారాలు నింపి దరఖాస్తుదారుని సంతకం తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి బిఎల్‌ఒ దగ్గర, తమ పరిధిలో గల ఓటరు జాబితా, రిజిస్టర్లు, బిఎల్‌ఒల పేర్లు, ఫోన్‌ నెంబర్లను ఉండాలని ఆదేశించారు.