
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ జిల్లాలో రెండో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలిం చేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదివారం సుడిగాలి పర్య టన చేశారు. 18 సంవ త్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయించుకోవాలని అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1569 పోలింగ్ స్టేషన్లలోని బూత్ లెవల్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉంచి ఓటరు నమోదు దరఖాస్తులు మరియు అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఓటరుకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్న ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా టోల్ గేట్ వద్ద పూలు షాపుల వద్ద, ఆర్‌డిఒ కార్యాలయం వద్ద, సంత మార్కెట్ వద్ద ఓటర్ల జాబితా ప్రచురణపై ప్రజల్లో అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. మునిసిపల్ పాఠశాలలోని 74, 75, 76 పోలింగ్ స్టేషన్లను, సంస్కత పాఠశాలలోని 84 పోలింగ్ బూత్‌లను కలెక్టర్ పరిశీలించి బిఎల్‌ఒలకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఓటరు ఈ ఏడాది అక్టోబర్ 27న ప్రచురించ బడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకుని, అందులో తమ ఓటు ఉన్నది లేనిది సరి చూసుకోవాలన్నారు. ఓటరు జాబితా నందు ఏమైనా సవరణలు అవసరం అయితే బిఎల్‌ఒల ద్వారా సంబంధిత ఫారంలో దరఖాస్తులను పూర్తి చేసి ఇవ్వాలన్నారు. ఈ పర్యటనలో ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి.సువర్ణ, తదితరులు పాల్గొన్నారు