
పార్వతీపురం : ఓటరు నమోదు, సవరణ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరు ఛాంబరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు నమోదుకు, అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 4,5, డిశంబరు 3,4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోనివారు, జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తవుతున్న యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవా లన్నారు. అక్టోబరు 27న విడుదల చేసిన ఓటరు జాబితా ముసాయిదాలో అభ్యంత రాలుంటే తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాను ప్రతి ఒక్కరూ పరిశీలించు కోవాలని, వాటిలో తొలగింపులు, చేర్పులు వంటి అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించారు. ఫారం 7,8 ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశం ఉందని, ముసాయి దాలోని క్లైములు, అభ్యంతరాలను అక్టోబర్ 27 నుండి డిసెంబరు 9 వరకు స్వీకరి స్తున్నట్టు తెలిపారు. డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరించి, 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురణ సిద్ధం అవుతుందని స్పష్టం చేశారు. ఓటరు జాబితా తయారీ ప్రక్రియ పట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకట్రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.