ప్రజాశక్తి మచిలీపట్నం రూరల్ : ఫోటో ఓటర్ల జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తమ దష్టికి తీసుకువస్తే భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం సరి చేస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబు పేర్కొన్నారు.బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా జరుగుతోందన్నారు. ఇప్పటివరకు తాజా సమాచారంతో రూపొందించిన ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశామని అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తన దష్టికి తీసుకొని రావాలని కోరారు.ఈ సందర్భంగా కొందరు ప్రతినిధులు ఒక ఓటరు చిరునామా ఒకచోట ఉంటే ఇంకొక చిరు నామాతో ఎపిక్ కార్డులు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకొని రాగా ఇది ఒక సాంకేతిక సమస్యని ఈ అంశాన్ని ఎన్నికల సీఈఓ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరి స్తామని కలెక్టర్ చెప్పారు. ఎపిక్ కార్డ్ సంఖ్య టైపు చేస్తే అందులో పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునే విధంగా జిల్లాకు ఒక ప్రత్యేకమైన యాపును తయారు చేయాలని ప్రతినిధులు కోరగా అందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆ యాపు విషయమై సీఈఓ కార్యాల యాన్ని సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ పెద్దిరోజా, వైఎస్‌ఆర్సిపి, బిజెపి, బీఎస్పీ, టిడిపి ప్రతినిధులు షేక్ శిలార్ దాదా, పంతం వెంకట గజేంద్ర రావు, ఎస్ బాలాజీ, ఎస్.యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.