ప్రజాశక్తి-తెనాలి : ఓటరు జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి పరిశీలించారు. మండల ంలోని చావవారిపాలెం వచ్చిన కలెక్టర్ తొలుత బిల్వోలతో మాట్లాడారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్, షిఫ్టింగ్ ఓట్ల వివరాలు తెలుసుకున్నారు. ఓట్ల తొలగింపులో తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఓటర్లతోనూ మాట్లాడారు. జాబితాలో తొలగించిన వారి పేర్లను, వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు.
అంగన్‌వాడీ సెంటర్ నిర్వహణ లోపంపై ఆగ్రహం
గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలందిం చేందుకు ఐసిడిఎస్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. రూరల్ గ్రామం చావావారిపాలెం, అంగలకుదురులో పర్యటించిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజనం, పిహెచ్‌సిల్లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి జగనన్న గోరుముద్ద రుచి చూశారు. నాడు-నేడు పనులు త్వరితగతిన పూర్తికావా లన్నారు. చావావారిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఫ్లోరింగ్ కుంగిపోవటం, విద్యుత్ సరఫరా లేకపోవటంపై అంగన్‌వాడీ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ పీడీని ఫోన్‌లో ఆదేశించారు. వెంటనే విద్యుత్ పునరుద్ధరి ంచాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అంగలకుదురు నార్త్ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కేంద్రంలో లబ్ధిదారులుగా ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరా లను పరిశీలించారు. వైఎస్సార్ సంపూర్ణపోషణ కిట్ల పంపిణీపై అంగన్‌వాడీ టీచర్ ద్వారా తెలుసుకున్నారు. గర్భిణుల వివరాల నమోదు, వారిలో రక్తహీనత గురించి మందులు పంపిణీ, వైద్య పరీక్షలు చేయించటంపై ఎఎన్‌ఎంలు శ్రద్ధ వహించాలన్నారు.
వికలాంగ పింఛనుపై విచారణ
గ్రామానికి చెందిన చిట్టాబత్తిని ఎలిజబెత్ కలెక్టర్‌ను కలిశారు. తన కుమారుడు నడవలేని స్థితిలో మంచంలో ఉన్నాడని, వేలిముద్రలు కూడా పడటం లేదని, ఫలితంగా సదరం సర్టిఫికెట్ మంజూరవక వికలాంగ పింఛను నిలిచిపోయిందని తెలిపారు. స్పందించిన కలెక్టర్... ఎలిజబెత్ ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. డీసిహెచ్ డాక్టర్ హనుమం తరావు, డిఆర్‌డిఎ పీడీ హరనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి సదరం సర్టిఫికెట్ ఇప్పించి, పింఛను మంజూరు చేయాలని ఆదేశించారు. నివేశన స్థలం, శ్మశానానికి స్థలం కేటాయింపు వంటి సమస్యలపై గ్రామస్తులు తన దృష్టికి తెచ్చిన అంశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా తహశీ ల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట సబ్‌కలెక్టర్ గీతాంజలిశర్మ, తహశీల్దార్ కె.రవిబాబు, ఎఇఒ ఎం.లక్ష్మినారాయణ, పంచాయతీ కార్యదర్శులు వైవిడి ప్రసాద్, జి.ప్రసాద్ ఎన్నికల డిటి ప్రసాద్, సూపర్‌వైజర్ వాసు, బిఎల్వో గీత, పిఆర్ ఇఇ ముత్యంబాబు, డిఇ జివోవిఎస్ గుప్త, ఎఇ వెంకటేశ్వర్లు, సిడిపిఒ సునీత ఉన్నారు.










