Aug 19,2023 22:06

పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: సరైన ధ్రువపత్రాలు లేకుండా ఓటర్లను తొలగించరాదని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ స్పష్టం చేశారు. నరసన్నపేట, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా తొలగింపులకు సంబంధించి పత్రాలు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ శనివారం పరిశీలించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో తగిన జాగ్రత్తలు పాటించి పూర్తి ఆధారాలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరగాలని, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు.