పలాస : ఈ నెల 21 నుంచి అక్టోబరు 20 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే నిర్వహిస్తామని, దీనికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని ఆర్‌డిఒ సీతారామ్మూర్తి అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పార్టీల నాయకులతో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తామని అన్నారు. అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారని తెలిపారు. ఓటర్లు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారా? లేదా? వేర్వే ప్రాంతాల్లో నివాసముంటున్నారా? తెలుసుకొని సరి చేస్తామని అన్నారు. 18 ఏళ్లు నిండి చదువుకుంటున్న విద్యార్థులకు ఓటరుగా నమోదు చేయాలన్నారు. మండలాల వారిగా సర్వే నిర్వహిస్తూ వారం వారం సమావేశాలు ఏర్పాటు చేసి వాటిపై సమీక్షిస్తామన్నారు. సమావేశంలో తహశీల్దార్ మధుసూదనరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు సింహాచలం, టిడిపి నాయకులు విఠల్‌రావు, బడ్డ నాగరాజు, జనసేన నాయకులు కూన కృష్ణారావు, బిజెపి నాయకులు ధర్మారావు పాల్గొన్నారు.










