రాయచోటి : ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024లో భాగంగా ఇంటింటి సర్వే వంద శాతం పూర్తి కావాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎక్స్ అఫిషియో కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కార్యక్రమానికి రాయచోటి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గిరీష, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా కోసం చేపట్టిన ఇంటింటి సర్వే పురోగతిపై జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఫారం 6 కొత్త ఓటర్లకు 18 సంవత్సరాల నిండిన వారికి ఇవ్వాలని, ఫారం 8 చిరునామా మార్పులు కొరకు ఇవ్వాలన్నారు. ఓటర్లు తొలగింపు సంబంధించి ప్రొసీజర్ ప్రకారం జాగ్రత్తగా చేయాలన్నారు. పలు అంశాలపై అందుకు సంబంధించిన కార్యాచరణపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈఆర్ ఓలు, ఎఒఆర్‌ఒలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి విధానాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024ను ఎలాంటి పెండింగ్ లేకుండా ఇంటింటి సర్వేని వేగవంతం చేస్తున్నామని వివరించారు. జిల్లాలో ఫారమ్ 6 ఫారమ్-7, ఫారమ్-8 పెండిన్సిలపై, గ్రీవెన్స్‌ల పరిష్కారాల గురించి వివరించారు. కొత్తగా ఓటు నమో దుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 18-19 వయస్సులో ఉన్న వారు, ట్రాన్స్ జెండర్లు, నిరాశ్రయుల జాబితాను తయారీలో ప్రత్యేక దష్టి సారించాలని సంబందిత అధికారులకు సూచించారు.










