Aug 23,2023 23:19

సర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న కమిషనర్‌ స్వప్నిల్‌

ప్రజాశక్తి - విజయవాడ : ఓటర్ల జాబితాపై సిబ్బంది చేస్తున్న డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం జరుగుతున్న తీరును నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పరిశీలించారు. సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలో ఆయా పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ఓటర్ల జాబితాను ఇంటింటికి వెళ్లి నిశితంగా పరిశీలించి, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, చనిపోయిన ఓటర్ల తొలగింపు వంటి వాటి ప్రక్రియను స్వయంగా కమిషనర్‌ పరిశీలించారు. ఫారం-6, 6ఎ, 7, 8 ఫారాలను అందించి దరఖాస్తులను స్వీకరించి మొబైల్‌ యాప్‌లో అప్‌ లోడ్‌ చేసే విధానాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు. ప్రధానంగా ఒకే డోర్‌ నెంబర్‌లో ఎక్కువ ఓట్లు ఉన్న వాటిని, జీరో డోర్‌ నంబర్‌ ఉన్న వాటిని జంక్‌ క్యారెక్టర్‌లు ఉన్నవాటిని ప్రత్యేకంగా పరిశీలించారు. 100 పై బడిన వారి ఓటర్ల వయస్సు దవీకరణ పత్రాలను పరిశీలించారు, స్వీకరించిన జాబితాను ఆన్‌లైన్‌లో కూడా పరిశీలించారు.ఈ కార్యాక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు, సూపర్‌వైజర్‌, బిఎల్‌ఓలు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.