Jul 15,2023 23:50

మాట్లాడుతున్న రామలక్ష్మి

ప్రజాశక్తి -నక్కపల్లి:ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాకు సంబంధించి చేపట్టనున్న ఇంటింటా సర్వే పక్కగా నిర్వహించాలని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామలక్ష్మి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం బూత్‌ లెవెల్‌ అధికారులు, సూపర్వైజర్లతో సమావేశ నిర్వహించారు. ఈనెల 21వ తేదీ నుండి వచ్చే నెల 21వ తేదీ వరకు బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటా సర్వే చేపట్టాలని సూచించారు. ఓటరు లిస్టు ప్రకారం ఓటర్లు ఉన్నారా లేదా పరిశీలించి నమోదు చేయాలన్నారు. అర్హులు ఉంటే ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఎంపీడీవో సీతారామరాజు పాల్గొన్నారు.