
ప్రజాశక్తి- నెల్లిమర్ల : మండంలోని చంద్రంపేటలో శనివారం జరిగిన ఓటర్ల ప్రత్యేక డ్రైవ్‌ను టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఓటర్లను చేర్పించడం, మార్పులు ఉంటే పార్టీ తరుపున కచ్చితంగా నాయకులు దగ్గరుండి సరిచేయాలన్నారు. బిఎల్‌ఒలకు టిడిపి తరుపున నాయకులు సహకరించి ఓటర్ల జాబితాను సక్రమంగా తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
డెంకాడ: మండలంలోని జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ పి. ఆదిలక్ష్మి పెదతాడివాడ బిఎల్‌ఒలు నమోదు చేసిన ఓటర్ల జాబితాను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్‌ఒలను ఇంటింటికి వెళ్లి కొత్తగా ఓటర్లు ఉంటే నమోదు చేయాలని, చేసిన వాటిని పరిశీలించాలని కోరారు. ఆర్‌ఐ, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.
వేపాడ : మండలంలోని పాటూరు, సోంపురం, గుడివాడ, ఆకుల సీతంపేట, వల్లంపూడి, వేపాడ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లను, ఓటర్ల ప్రత్యేక డ్రైవ్‌ను ఆర్‌ఒ సుదర్శన రావు శనివారం పరిశీలించారు. సిబ్బంది పాటించాల్సిన నిబంధనలు గురించి ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసన్నకుమార్, ఆర్‌ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్ అప్పలనాయుడు, బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.