
రాయచోటి : భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో 80 ఏళ్లు నిండిన ఓటర్ల పాత్ర ఆదర్శప్రాయమని డిఆర్‌ఒ సత్యనారాయణ తెలిపారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ వద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో 80 సంవత్సరాలు నిండిన వద్ధ ఓటర్లకు స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్లో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్ 1న అంతరా ్జతీయ వద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో 80 ఏళ్ల పైబడిన ఓటర్లకు సన్మానం నిర్వహించామని తెలిపారు. వీరందరూ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎంతో కషి చేశారని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. వీరి అడుగుజాడల్లోనే మనమంతా నడిచి, ఓటు వేసి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. రాయచోటిలోని బేతల్ కాలనీలో నివసిస్తున్న 80 ఏళ్ల హరినాధ గుప్తా, మాసాపేటలో నివసిస్తున్న 82 ఏళ్ల కమల్ సాహెబ్, 84 ఏళ్ల ఖాదర్, ఎస్ఎన్ కాలనీకి చెందిన 80 ఏళ్ల సుబ్బారెడ్డిని డిఆర్‌ఒ సన్మానించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సత్య నారాయణ చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. కార్యక్ర మంలో కలెక్టరేట్ లోని ఎలక్షన్ సెల్ సిబ్బంది, సన్మానించబడిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పీలేరు: సమాజంలోని పెద్దలను గౌరవించడం మన సంస్కతి, సంప్రదాయమని పీలేరు హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోపాలకష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో అంతర్జాతీయ వద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 80 వసంతాలు నిండిన సీనియర్ ఓటర్లను సత్కరించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ సీనియర్ ఓటర్లు తమ అనుభవంలో ఎన్నో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉంటారని అన్నారు. వారి అపార అనుభవాలను నేటితరం యువత ఆదర్శంగా తీసుకుని మన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వద్ధుల పట్ల చిన్న చూపు చూడడం తగదని, వారిని అన్ని విధాల ఆదరిస్తూ వారి శేష జీవితాన్ని ఆనందంగా గడపడానికి మనమందరం సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎఎస్‌ఒ రామ్మోహన్, విఆర్‌ఒలు సురేష్ రెడ్డి, ఎర్రయ్య, రవికుమార్‌తో పాటు షీ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పివిఎస్ లక్ష్మి, డాక్టర్ రాయల సుధాకర్ రాయలు దంపతులు, పాల్గొన్నారు.