Jul 24,2023 00:27

మాట్లాడుతున్న పైలా ప్రసాదరావు

ప్రజాశక్తి-మాడుగుల:ఓటర్ల నమోదు కార్యక్ర మంలో టిడిపి కార్యకర్తలు జాగ్రత్త వహించాలని ఆ పార్టీ నేత పైలా ప్రసాదరావు సూచించారు. ఆదివారం కే జే పురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవలసిన అవసరం వుందని అన్నారు. కొత్త ఓటు నమోదుతో పాటు, పాత వారు తమ చిరునామాలు మార్చుకోవచ్చున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి వుండడం ఎంతో అవసరమన్నారు. కొత్త ఓట్ల నమోదు ప్రక్రియలో కార్యకర్తలు జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాపేటి జోగి నాయుడు, దాడి రామ లక్ష్మణ, తనకాల శివ, యల్లపు రాము, సరగడం ఆదిబాబు, కాళ్ళ నరసింగరావు, గంగు నాయుడు, వేగి నారాయణ రావు, ఆదారి నారాయణరావు, మొల్లేటి గంగ అప్పారావు, మద్దాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.