
ప్రజాశక్తి - భట్టిప్రోలు (వేమూరు)
టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం తెనాలి టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నూతన ఓటర్ల జాబితాను క్లస్టర్, బూతు స్థాయి ఇన్చార్జులు తీసుకుని పరిశీలించాలని కోరారు. ప్రతి ఒక్కరి ఓటును సరిచూడాలని అన్నారు. ఓట్లు కచ్చితంగా ఉన్నాయా లేక తొలగించబడ్డాయో చూసుకొని తిరిగి వాటిని మరో మారు ఓట్లు కొరకు దరఖాస్తులు చేయించాలని సూచించారు. తొలుత ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూరుగుంట్ల సాయిబాబా, భట్టిప్రోలు టిడిపి కన్వీనర్ వాకా శేషుబాబు, కొల్లూరు కన్వీనర్ పైనేను మురళీకృష్ణ, కనగాల మధుసూదనప్రసాద్, నాయకులు వై కరుణ శ్రీనివాసరావు, బట్టు మల్లికార్జునరావు, జయసిలరావు, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.