సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి
ప్రజాశక్తి - సీతంపేట : ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులుంటే సరిచేస్తున్నామని, మీ దృష్టిలో ఇంకా ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










