Nov 01,2023 20:34

మాట్లాడుతున్న ఆర్‌డిఒ సాయిశ్రీ

బొబ్బిలిరూరల్‌: ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్‌డిఒ ఎ.సాయిశ్రీ అన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణపై సూచనలు చేశారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 4, 5, డిసెంబరు 2, 3 తేదీలను ప్రత్యేక ప్రచార రోజులుగా ప్రకటించారు. ఆ రోజుల్లో బిఎల్‌ఒలు పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిఎస్‌ డిటి ఆర్‌.సాయికృష్ణ, ఆర్‌ఐ కళ్యాణ్‌ చక్రవర్తి, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.