Aug 09,2023 00:05

పల్నాడు జిల్లా: జిల్లాలో ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు. రొంపిచర్ల మండలంలోని విప్పర్ల రెడ్డి పాలెం గ్రామంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి బూత్‌ లెవల్‌ అధికారులతో మాట్లాడారు. పలువురు ఓటర్లతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడి వారికున్న అనుమానాలను నివత్తి చేశారు. ఓటర్ల జాబితా రూపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై జిల్లా కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గ అంశాలపై పలు ఆదేశాలను బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు కు ఇచ్చి, త్వరిత గతిన సర్వే ప్రక్రియ ను పూర్తి చేయాలన్నారు.
విద్యా సర్వే ప్రక్రియపై ఆకస్మిక తనిఖీ
జిల్లాలో వాలంటీర్లు చేపట్టిన ఎడ్యుకేషన్‌ సర్వే ప్రక్ర ియపై రొంపిచర్ల మండలం సంతగుడిపాడు లో కలెక్టర్‌ శివశంకర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వే ప్రక్రియ క్షేత్ర స్థాయిలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌, తహశీల్దార్‌, మండల విద్యా శాఖ అధికారి, మండల అభివద్ది అధికారి, ఆయా ప్రభుత్వ జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రధానోపాధ్యాయు లతో వాలంటీర్లు, ఎం.ఎస్‌.ఎస్‌.కే లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఇతర అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. సర్వే ప్రక్రియను సమర్ధ వంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బడి మానేసిన వారు, బడి బయట ఉన్న వారి వివరాలను సేకరించి, వారి బడులలో చేరేలా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ బడికి వెళ్లకుంటే గల కారణాలను నివేదికలో తెలియ జేయాలని సూచించారు.సర్వే ప్రక్రియ కార్యక్రమాన్ని మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కౌమారదశ బాలికల్లో రక్తహీనతను తగ్గించేందుకు చర్యలు
జిల్లా వ్యాప్తంగా కౌమార దశ బాలికలలో ఉన్న రక్త హీనత శాతాన్ని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదే శించారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా బడిలో చదువు తున్న బాలికలు, బడి బయట ఉన్న బాలికలను గుర్తించి వారిలో ఉన్న రక్తహీనత సమస్యను గుర్తించడంతో పాటుగా వారికి ఆరోగ్యం పై అవగాహన కల్పించి, పౌష్ఠికాహారం అందించడం ద్వారా సరైన మందులు అందించి బాలికల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.