Sep 19,2023 20:51

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులను దాదాపుగా పరిశీలన పూర్తి చేశామని కలెక్టర్‌ గిరీష రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. మంగళవారం ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుండి 2024 ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించి రీ వెరిఫికేషన్‌ ఆఫ్‌ ఎలెక్టోర్స్‌, ఫామ్‌ 6, 7, 8 డిస్పోజల్స్‌, హౌస్‌ టు హౌస్‌ సర్వే, డూప్లికేట్‌, సిఫ్టెడ్‌, డెత్‌ ఎలెక్టోరల్స్‌, జంక్‌ క్యారెక్టర్‌, 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న డోర్‌ నెంబర్స్‌, రేషనలైజేషన్‌ ఆఫ్‌ పోలింగ్‌ స్టేషన్స్‌, ఎపిక్‌ కార్డ్స్‌ జనరేషన్‌, ప్రిటింగ్‌, పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, చీఫ్‌ ఎలెక్టోరల్‌ అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ గిరీష, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2024 ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి 40,358 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ ఫిర్యాదులన్నింటికీ సంబంధించి 90 శాతం మేర పరిశీలన పూర్తి చేశామని వివరించారు. రాజకీయ పార్టీలు అందించిన ఫిర్యాదుల్లో డెత్‌ కేసులు 18,936, శాశ్వతంగా షిఫ్ట్‌ అయిన ఓటర్లు 3,799 ఉన్నట్లు తెలిపారు. వీటన్నిటిని ఇంటింటి సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలగింపులకు సంబంధించి పరిశీలన పూర్తి అయిందన్నారు. ఆయా క్లైమ్లకు సంబంధించి ఫామ్‌ లను సేకరించి ఈఆర్‌ఓ నెట్‌ ఆన్‌ లైన్‌ నందు అప్లోడ్‌ చేస్తున్నట్లు చెప్పారు. జంక్‌ క్యారెక్టర్స్‌ 3700 ఇఆర్‌ఒ నెట్‌లో అప్లోడ్‌ చేశామన్నారు. ఫామ్‌ 6లో 15శాతం, ఫామ్‌ 7లో 17 శాతం, ఫామ్‌ 8లో 6.3 శాతం పెండింగ్‌ ఉందని వీటిని కూడా సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలతో ఈ నెల 20న జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని ఆరోజు పోలింగ్‌ స్టేషన్ల రేషనల్లైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 22న తుది జాబితాను ఎలక్షన్‌ కమిషన్‌కు పంపడం జరుగుతుందని వివరించారు. ఎపిక్‌ కార్డుల జనరేషన్‌ మరియు పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ వివరించారు.ఈ సందఠంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ అక్టోబర్‌ 17 నాటికి ఓటర్‌ జాబితా కరెక్షన్స్‌ అన్నిటిని పూర్తి చేసి పబ్లిష్‌ చేయాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలో అందిన ఫిర్యాదులపై ఇంటింటి వారీగా పక్కగా పరిశీలన పూర్తి చేసి అందిన అన్ని ఫామ్‌ లను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. తప్పులు లేని స్వఛమైేన ఓటర్‌ జాబితాకు కషి చేయాలని ఆయన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డిఒ రంగస్వామి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.