Nov 04,2023 21:43

పాలకొండ లో బిఎల్‌ఒలతో మాట్లాడుతున్న పిఒ కల్పనాకుమారి

ప్రజాశక్తి - పాలకొండ : ఈనెల 4, 5 తేదీల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ సందర్భంగా ప్రతి పోలింగ్‌ స్టేషన్లో సంబంధిత ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఐటిడిఎ పిఒ కల్పన కుమారి అన్నారు. శనివారం పాలకొండ పట్టణంలోని పోస్ట్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న 167 పోలింగ్‌ కేంద్రాన్ని, ఆర్సీఎం పాఠశాలలో ఉన్న 168 పోలింగ్‌ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ కొత్తగా ఓటరు నమోదుకు వస్తే వెంటనే వారి నుంచి దరఖాస్తు తీసుకోవాలన్నారు. ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ రెండు రోజులు బిఎల్‌ఒలు విధిగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు బిఎల్‌ఒలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని 27 పంచాయతీల్లో ఓటర్లు నమోదు ప్రక్రియ జోరుగా సాగుతుంది. కొత్త ఓటర్లను నమోదు చేయడం, పాత ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిమగమయ్యారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో శనివారం ఓటర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బి గౌరీ శంకర్రావు ఉన్నారు.