Nov 06,2023 00:27

పల్నాడు జిల్లా: ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ - 2024 లో భాగంగా జిల్లా జాయింట్‌ కల ెక్టర్‌ ఎ. శ్యాం ప్రసాద్‌ నరసరావుపేట మండలంలోని రావిపాడు గ్రామంలోని వెంగల్‌రెడ్దినగర్‌, మండల పరిషత్‌ ప్రాథమి కోన్నత పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ నెం.70, 71, నరసరావుపేట పట్ట ణం రామిరెడ్డిపేట కాశీరత్నం పాఠశా లలోని పోలింగ్‌ బూత్‌ నెం.140,144, 146, 147, 151 లను ఆదివారం పరి శీలించారు. గత నెల 27న ప్రచురితమైన ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటుగా సంబంధిత బూత్‌ స్థాయి అధికారులు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 9.00 గంటల సాయంత్రం 5.00 గం వరకు తప్పనిసరిగా ఉండాలని ఆదేశిం చారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరి శీలించి జీరో డోర్‌ నెంబరు, ఒకే ఇంటి నెం బరుతో పదికి మించి ఓటర్లుగా నమోదైన వారి వివరాలను ఆయా ఇళ్ళకు వెళ్లి పరి శీలించి తగిన సవరణల కోసం ఫారం-8 పూర్తి చేయాలన్నారు. చని పోయిన ఓట ర్లను తొలగించడం, కుటుంబ సభ్యుల నుండి ఫారం-7 పూర్తి చేయా లన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరిని ఓట రుగా నమోదు చేసేందుకు ఫారం-6 తీసుకొని తక్షణమే విచారణ చేసి నివేదిక సం బంధిత ఎఇఆర్‌ఒలకు ఇవ్వాలన్నారు. శాశ్వత నివాసం ఉండని ఓటర్లను గుర్తించి ఫార్మేట్‌-బి లోను, డబుల్‌ ఓట్లు గల వారిని కూడా గుర్తించి ఫార్మేట్‌ - ఏ లోను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బూత్‌ స్థాయి అధికారులు ఆయా విష యాలపై అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెం గల్‌ రెడ్దినగర్‌ లో ఒకే డోర్‌ నెం. 220-2 లో ఉమ్మడి కుటుంబంగా ఉన్న 11 మంది ఓటర్లు మందుల జగన్నాధం ఇంటిని జాయింట్‌ కలెక్టర్‌ స్వయంగా పరిశీ లించారు. వచ్చే నెల 2,3 తేదీలలో జరగ నున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. నరసరావు పేట మండల తహశీల్దార్‌ ఆర్‌వి రమణ నాయక్‌, మునిసిపల్‌ కమిషనరు రామ్మో హన్‌, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.