
జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ఓటర్ల జాబితా పగడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 32 వార్డు సచివాలయాన్ని, పెంటపాడు మండలం ముదునూరు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టరు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్టర్లను, కంప్యూటర్ డేటాను పరిశీలించారు. సాయంత్రానికి నూరుశాతం సర్వే పూర్తిచేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భÛంగా కలెక్టరు మాట్లాడుతూ ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగించారని ఫిర్యాదులు రాకూడదని, అందరూ మెచ్చే విధంగా ఓటరు జాబితా ఉండాలని తెలిపారు. ఎంత మందిని కొత్త ఓటర్లను చేర్చారు, ఎంతమంది ఓటర్లను తొలగించారని, ఎంత మంది ట్రాన్ప్‌ఫర్ చేసుకున్నారని, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఎంత మంది ఉన్నారని కలెక్టరు ఆరా తీశారు. ఈ కార్య క్రమంలో తాడేపల్లిగూడెం ఎఇఆర్‌ఒ జిల్లా హార్టీకల్చర్ అధికారి ఎ.దుర్గేష్, తహశీల్దార్లు వై.దుర్గాకిషోర్, జివి శేషగిరి, పురపాలక సంఘం కమిషనర్ ఎ.శామ్యూల్, ఎంపిడిఒలు సిహెచ్ బాలాజీ, విశ్వనాథం, డిప్యూటీ తహశీల్దారు శివశంకర్ పాల్గొన్నారు.