Aug 22,2023 21:59

ఫొటో : మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ ఎన్‌.పెంచలయ్య

ఓటర్ల జాబితా పై సమావేశం
ప్రజాశక్తి-దగదర్తి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఓట్ల జాబితాపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ ఎన్‌.పెంచలయ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్‌ ఉన్నాడా లేడా క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సూచించారు.
గ్రామంలోని బిఎల్‌ఒలు గానీ ఇతర శాఖ అధికారులు గానీ ఇంటికి వెళ్లకుండా లేరని కుంటి సాకుతో ఓటర్ల జాబితాలో పేరు తొలగించడం జరిగిందంటే అట్టువారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అధికారి వీలైనంత త్వరగా ఓటర్ల జాబితాను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వెలుగు ఎపిఎం, పంచాయతీ కార్యదర్శులు, సిసిలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.