పోలీసులతో మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్న టిడిపి కార్యకర్త అరెస్ట్
-పోలీసు స్టేషన్‌కు వచ్చిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు:కోటమిట్ట ప్రాంతంలో ఓటర్ వెరిఫికేషన్ చేస్తున్న ఒ మహిళా టిడిపి బిఎల్‌ఎను చిన్నబజారు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న టిడిపి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పార్టీ నాయకులతో కలిసి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. తమ పార్టీకి చెందిన మహిళా బిఎల్‌ఎను అకారణంగా ఎందుకు అరెస్టు చేశారని, కేసు ఎవరు పెట్టారో చెప్పాలని చిన్నబజారు పోలీసు స్టేషన్ సిఐ అశోక్‌కుమార్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాదానంగా సిఐ తాను కోర్టుకు వెళ్ళాలని, స్టేషన్‌లో కూర్చోని ఉంటే తాను తిరిగి వచ్చి వివరాలు తెలియజేస్తామంటూ సమాదానం ఇచ్చారు. తమకు పనులున్నాయని, కేసు ఎవరు పెట్టారో చెప్పి వెళ్లాలని సిఐని అడ్డుకున్నారు. వైసిపి ప్రభుత్వంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, అత్యుత్సాహాలు ఎక్కువయ్యాయని, అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినవి చెప్పినట్లు తుచా తప్పకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులకు, పోలీసులకు మద్య వాదనలు పెరిగిపోయి ఒక్కసారిగా చిన్నబజారు పోలీసు స్టేషన్ ప్రాంతంలోఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఒకానొక సమయంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి నీ ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించారు.. దీంతో కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ వైసిపి కార్యకర్త లాగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు.. అనంతరం మరోసారి కోటంరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించి.. నోటికి పని చెప్పాడు.. దీంతో కార్యకర్తలు ఒకసారిగా సిఐ తీరు పై మండిపడ్డారు..కోటంరెడ్డి సైతం సిఐ మీద మండిపడ్డారు.. దమ్ముంటే తన పై అక్రమ కేసులు పెట్టుకోవాలని.. తనను కాల్చే దమ్ము ఉందా అంటూ సిఐ మీదకు వెళ్ళారు.. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరో ఆరు నెలల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు ఒక్కొక్కరికి తాట తీస్తానని కోటంరెడ్డి హెెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాఫర్ షరీఫ్, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కువ్వరపు బాలాజీ, జహీర్, ప్రశాంత్ ,ఇక్బాల్ జాఫర్, సుధాకర్ రాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు










