Aug 28,2023 20:31

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - నెల్లూరు : ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ ఎన్నికల అధికారులను హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి ఈఆర్వోలు, ఎఇఆర్వోలతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ జాగ్రత్తగా చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని సున్నితంగా హెచ్చరించారు. ఎన్నికల అధికారులు ఫామ్‌ సెవెన్‌ సేకరించడం పూర్తిచేయాలని, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో సేకరించిన సమాచారం మేరకు అన్ని రకాల ఓటర్‌ క్లెయములు, అబ్జెక్షన్లను పూర్తి చేయాలని సూచించారు. డెత్‌, షిఫ్టెడ్‌ ఓటర్లకు సంబంధించి నిశితంగా రీ వెరిఫికేషన్‌ చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఓటరు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల అధికారులు అందరూ ప్రధానంగా ఫామ్‌ 7 సేకరణ, డిస్పోజబుల్‌ ఆఫ్‌ ఫార్మ్స్‌, డిలేషన్‌ కు సంబంధించి వెరిఫికేషన్‌, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియ అంశాలపై ప్రత్యేక దష్టి 4 రోజుల లో పూర్తి చేయాలన్నారు. చివరి రోజు వరకూ జాప్యం చేయకుండా ఫార్మ్స్‌ సేకరించాలని,సేకరించిన అన్ని ఫామ్స్‌ మూడేళ్లపాటు భద్రపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. డిఆర్‌ఒ వెంకటనారాయణమ్మ, ఎలక్షన్‌ డీటీ ఆషర్‌ పాల్గొన్నారు.