Sep 06,2023 21:56

ఫొటో : ఓట్ల పరిశీలన చేపడుతున్న నాయకులు

ఓట్ల పరిశీలన బాధ్యతగా చేయాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు : వరికుంటపాడు పంచాయతీలోని కనియంపాడు గ్రామంలో బుధవారం డోర్‌ టూ డోర్‌ ఓటర్‌ వెరిపికేషన్‌ కార్యక్రమాన్ని బిఎల్‌ఒలు, ఎఇఆర్‌ఒలు సూపర్‌వైజర్లు బాధ్యతగా నిర్వహించాలని డిప్యూటీ కలెక్టర్‌, ఉదయగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి ఎం.వి.సుధాకర్‌ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్‌ఒలు తొలగించిన, శాశ్వతంగా వలసలు వెళ్లిన, చనిపోయిన, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను క్షేత్రస్థాయిలో ఓటర్ల సమీక్షంలో పరిశీలన జరిపారు. ఓటు తొలగించిన వారి ఇంటికి వెళ్లి వాస్తవంగా తొలగించారా లేక ఇతర కారణాల వల్ల తొలగించారా అనే విషయంపై విచారించారు. ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తే ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిపై చర్యలు తప్పు అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సయ్యద్‌ ఇక్బాల్‌, విఆర్‌ఒ శేషారెడ్డి, సర్పంచ్‌ కొండిపోగు దిలీప్‌, సూపర్‌వైజర్‌ సుభాని, తదితరులు పాల్గొన్నారు.