Nov 08,2023 00:42

ప్రజాశక్తి - బాపట్ల
స్థానిక ఎఎంసి మార్కెట్‌ యార్డు గిడ్డంగుల్లో భద్రపరిచిన ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ పూర్తయినట్లు ఆర్డీఒ రవీందర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఎఫ్ఎల్‌సి ప్రోగ్రాం బెల్ కంపెనీ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీని పూర్తి చేశామని అన్నారు. మాక్ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.  కష్టతరమైన ఎఫ్ఎల్‌సి, మాక్ పోల్ కార్యక్రమ ఏర్పాట్లను ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన ఆర్డిఓ గంధం రవీందర్, తహశీల్దారు చిన్నం సుధారాణి,  డిప్యూటీ తహశీల్దారు శ్రీదేవిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా ఆర్డీఒ రవీందర్‌ను రాజకీయ పార్టీల నాయకులు తహశీల్దారు కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇనగలూరి మాల్యాద్రి, కెవి రామకృష్ణ, దోనేపూడి రవి, షేక్ ఫరీద్, కాగిత కోటేశ్వరరావు, నూతలపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.