Apr 12,2023 16:06

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి

ఓర్వలేక టిడిపి అసత్య ఆరోపణలు : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - చాగలమర్రి

      వైసిపి  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రజలను పక్కదోవ పట్టించేలా టిడిపి  నాయకులు పగటి వేషగాళ్లలా వచ్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తెలియజేశారు. చాగలమర్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 3వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంగుల  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మండలానికి సంబంధించి 318 గ్రూపులకు రూ.1.63 కోట్ల చెక్కును బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా అందజేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఏ చిన్న పథకం లబ్దిచేకూరాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే దుస్థితి  ఉండేదన్నారు.కాని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి  ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాకే నగదు జమచేయడం జరుగుతుందని వివరించారు. మాభవిష్యత్తు నువ్వే జగనన్న స్టిక్కర్లను ప్రజలకు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి పై నమ్మకం ఉందని అడిగి తెలుసుకున్న తరువాతే స్టిక్కర్లు కరిపిస్తున్నామన్నారు.టిడిపి కి ఓటు వేస్తారన్న నమ్మకం నాయకులకు  ఉంటే ప్రజల వద్దకు వెళ్ళి అడిగి వాళ్ల స్టిక్కర్లు అంటించవచ్చ కదా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం జగన్ చిత్రపటానికి పొదుపు మహిళలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తులసమ్మ,, రాష్ట్ర ఆయిల్ఫెడరేషన్ చైర్మన్ గౌసియాబేగం, రాష్ట్ర మహిళా ఆర్థిక సాధికారిక సంస్థ డైరెక్టరు శ్రీవిద్య, ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు, జడ్పీటీసీ లక్ష్మిదేవి, మార్కెట్ యార్డు ఛైర్మన్ గంధం రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీలు రఫి, ఆశీర్వాదమ్మ, వైసిపి  మైనార్టిసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబులాల్‌ , మండల కన్వీనర్ కుమార్రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, ఎంపిటీసిలు పత్తి నారాయణ,లక్ష్మిరెడ్డి,వెంకటలక్ష్మి,ఫయాజ్‌,తహసీల్దారు విజయకుమార్, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, పశుసంవర్ధక సహాయ సంచాలకులు వరప్రసాదు, ఐకేపీ ఏసీ దానం, ఏపీఎం నాగమ్మ,వివిధ గ్రామాల సర్పంచులు, వైసిపి నాయకులు,పొదుపు లక్ష్మి మహిళలు,తదితరులు పాల్గొన్నారు.