Jun 28,2023 15:21
  • చిన్నారులతో ఓనమాలు దిద్దించిన మోహిత్ రెడ్డి

 ప్రజాశక్తి  - క్యాంపస్  :  సరస్వతీ నమస్తుభ్యమంటూ చదువుల తల్లిని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రార్ధించారు. బుధవారం శోభకృత నామ సంవత్సరం ఆషాడ మాసం శుక్ల పక్షం సందర్భంగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహిత్ రెడ్డి, తల్లి లక్ష్మీ పిల్లలు చేత తొలి అక్షరాలు రాయించారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ సాంప్రదాయం ప్రకారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి చదువుల తల్లి కటాక్షం మెండుగా ఉండాలని ప్రార్ధిస్తామన్నారు. పిల్లలు తమ జీవితంలో ఉన్నత చదువులు చదివి మంచి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తుమ్మలగుంట యం.పి.పి.స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లందుల సుబ్బిరామి రెడ్డి, మండల విద్యాశాఖాధికారులు విజయ, శంకరయ్య, ప్రధానోపాధ్యాయులు భారతి తదితరులు పాల్గొన్నారు.