ఒపిఎస్‌ను పునరుద్ధరించాలి
యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిపిఎస్ ప్రతులు దగ్ధం
ప్రజాశక్తి - తిరుపతి డెస్క్
ఒపిఎస్‌ను పునరుద్ధరించి, జిపిఎస్‌ను రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరెడ్డి అన్నారు. యుటిఎఫ్ కార్యాలయంలో జిపిఎస్ ప్రతులను తగలబెట్టి నిరసన తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రత లేని జిపిఎస్ విధానాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. సిపిఎస్ కన్నా జిపిఎస్ ప్రమాదకరమని అన్నారు. ఒపిఎస్ పునరుద్ధరణకు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామన్నారు. ఒపిఎస్ సాధించేంత వరకూ అలుపెరగని పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్ధి దండు రామచంద్రయ్య, నాయకులు పద్మజ, సురేంద్ర, మురళి, హేమాద్రిబాబు, మురళీకృష్ణ, సురేష్, రాజు పాల్గొన్నారు.
జిపిఎస్ ప్రతులను దగ్ధం చేస్తూ...










