Oct 19,2023 21:06

నిరవధిక దీక్షలు చేస్తున్న యటిఎఫ్‌ నాయకులు

రాయచోటి : సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలను అంగీకరించమని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాల్సిందేనని యుటియఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్‌ జాబిర్‌ డిమాండ్‌ చేశారు. యుటియఫ్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు గురువారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద పాత పెన్షన్‌ సాధనకై యుటియఫ్‌ జిల్లా నాయకత్వం నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాత పెన్షన్ని అమలు చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబు తుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడు దల చేయాలని డిమాండ్‌ చేశారు. 100 సంవ త్సరాల వరకు ఆర్థిక భారమని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. పాదయాత్ర హామీని అమలు చేయకుండా దేశానికే ఆదర్శమని చెబుతున్న జిపిఎస్‌ విధానం, సిపిఎఎస్‌కు మరొక రూపం తప్ప ప్రత్యామ్నాయం కాదని విమర్శించారు. నమ్మించి ఉద్యోగ, ఉపాధ్యా యులను మోసం చేసిందని తెలిపారు. 2024 ఎన్నికలలో ఒపిఎస్‌ అమలు చేస్తామని చెప్పే పార్టీలకే ఉద్యోగ, ఉపా ధ్యాయ కుటుంబాలు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఒపిఎస్‌అమలు చేసి ప్రజల పక్షాన ఉంటారా జిపిఎస్‌అమలు చేసి కార్పొరేట్లల పక్షాన ఉంటారో ప్రభుత్వాలు నిర్ణయి ంచుకోవాలని 33 సంవత్సరాల సర్వీసు పూర్తయి తేనే 50 శాతం పెన్షన్‌ ఇచ్చే జిపిఎస్‌, కాంట్రిబ ూ్యషన్‌ కట్టించుకునే జిపిఎస్‌ ఉద్యోగుల పాలిట మరణ శాసనం అని తెలిపారు. ఇప్పటికై ప్రభుత్వం జిపిఎస్‌ కాకుండా ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షలు ఓపిఎస్‌ సాధించేవరకు నిరవధికంగా కొనసాగుతాయని తెలియజేసారు. 20న అన్ని జిల్లాలోని రాజంపేట, పీలేరు, మద నపల్లి డివిజన్‌ కేంద్రాలలో దీక్షలు ప్రారం భమ వుతాయని తెలిపారు. పాత పెన్షన్‌ సాధించే దాకా నిరవధిక దీక్షలు అన్ని స్థాయిలలో కొనసా గుతా యన్నారు. జిల్లా కేంద్రంలో యుటియఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్‌, షేక్‌ జాబిర్‌, జిల్లా కోశాధికారి బి.చంద్ర శేఖర్‌, జిల్లా సి పి యస్‌ కన్వీనర్‌ సి.వి. రమణ మూర్తి, జిల్లా కార్యదర్శి రమణయ్య, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు దావూద్‌,సి పి యస్‌ సబ్‌ కమిటీ సభ్యులు ఫయాజ్‌, ఇమ్రాన్‌ దీక్షలో ఎస్‌టియు నాయకులు శివారెడ్డి, రవీంద్ర రెడ్డి, బిటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ రవిశంకర్‌, ఎపిటిఎఫ్‌ 257 జిల్లా అధ్యక్షులు ఏ హరిబాబు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. దీక్షకు మద్దతుగా యుటీఎఫ్‌ జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్ర రెడ్డి, జిల్లా కార్యదర్శి అక్రమ్‌ బాషా, రాయచోటి మండల అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు హఫీజుల్లా,రాజా రమేష్‌, సహాధ్యక్షులు రెడ్డి బసయ్య, సుండుపల్లె మండల అధ్యక్షుడు జి.శంకర్‌, వీరబల్లి మండల ప్రధాన కార్యదర్శి అమీన్‌, చిన్న మండెం మండల ప్రధాన కార్యదర్శి కిఫా యతుల్లా, కలకడ మండల ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్‌, రమణయ్య, మధుసూదన్‌ రాజు పాల్గొన్నారు.